కొడాలి నాని మాటల్లో అంతరార్థం అదేనా..?

ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మూడు రాజధానుల అంశం నేడు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. మూడు రాజధానుల అంశాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు అవడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. మూడు రాజధానుల అంశంపై వాదోపవాదాలు విన్న హైకోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మళ్లీ హైకోర్టు ఈ విషయంపై విచారణ చేపట్టడంతో మూడు రాజధానులు అంశాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తరుపున అడ్వకేట్‌ జనరల్‌ వెల్లడించారు. దీనిపై అసెంబ్లీలో కూడా చట్టాన్ని వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది.

అయితే ఇదిలా ఉండగా.. దీనిపై ఏపీ కేబినెట్‌ సమావేశం నిర్వహించన అనంతరం అసెంబ్లీ సమావేశాలకు ఒక్కొక్కరిగా మంత్రులు హజరవుతున్నారు. అసెంబ్లీ వద్దకు వచ్చిన మంత్రి కొడాలి నానిని మీడియా ఈ విషయంపై ప్రశ్నించగా… ‘జగన్‌ మోహన్‌రెడ్డిగారు, ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక.. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. టెక్నికల్‌గా కోర్టుకు పోయి.. రకరకాలుగా అంశాలు జరుగుతున్నాయి. దానిపైన ఏం చేయాలో కేబినెట్‌ చర్చిచాం. దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం.’ అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఆయన మాటలు విన్న కొందరు.. రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెట్టి శాసనమండలి అనుమతి అధికారికంగా తీసుకుంటారా..? అని అంటున్నారు. అందుకే కొడాలి నాని స్పష్టతనివ్వలేదని అంటున్నారు. ఏదేఏమైనా ఈ విషయంపై స్పష్టత రావాలంటే సీఎం జగన్‌ ప్రకటన చేసేవరకు వేచి చూడాల్సిందే..

Related Articles

Latest Articles