చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరు : కొడాలి నాని

చంద్రబాబు, నారా లోకేష్ పై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ బతికుండగా జగన్ ను ఓడించలేరని.. ఈ రెండేళ్ల పాలన చూసి 2014లో చంద్రబాబుకు ఓటు వేసి తప్పు చేశాం అని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. దేశానికే జగన్ ఆదర్శ ముఖ్యమంత్రి అని..చంద్రబాబులా వెన్నుపోటుతో జగన్ రాజకీయాల్లోకి రాలేదని చురకలు అంటించారు. ప్రజలను నమ్ముకుని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్న వ్యక్తి జగన్ అని..చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమన్నారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరిని వదలమని..రాజకీయంగా మాకు టీడీపీ ప్రత్యర్థి కాదని పేర్కొన్నారు. జగన్ ఎప్పటికీ సీఎం కాడు..రాసుకోండి అని ఓ నాయకుడు చెప్పాడని గుర్తు చేశారు. 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలను సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. సీఎం జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలను ఓర్వలేకే చంద్రబాబు,లోకేష్ విమర్శలు చేస్తున్నారని..లోకేష్ ఓ జోకర్..కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారని..పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో వైకాపా గెలిచిందన్నారు. చంద్రబాబు చరిత్ర ముగిసిన అధ్యాయమని.. జగన్ ను ఇబ్బంది పెట్టిన వారంతా కాలగర్భంలో కలసిపోయారని పేర్కొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-