సినీ ఇండస్ట్రీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు !

చిత్ర పరిశ్రమ వివాదంపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటో రజనీ మూవీ ఓపెనింగ్ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోరని చెప్పిన కొడాలి నాని… పవన్‌ కళ్యాణ్‌ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తుందన్నారు కొడాలి నాని.

ఇష్టా రాజ్యంగా టికెట్ల ధరలు పెంచు కోవడాన్ని మేమ సమర్థించబోమని తెలిపారు. ఖచ్చితంగా అందరికీ మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటామన్నారు కొడాలి నాని. తెలుగు సినిమాను ఎంతో కొంత షూటింగ్ జరపాలి అని కోరుకుంటున్నామని.. కొంత మంది కి లాభాలు తెచ్చి పెట్టాలని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోకుండా అడ్డగోలుగా టిక్కెట్ రెట్లు పెంచారని ఫైర్‌ అయ్యారు. చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు ఆడాలన్నారు. పవన్ కళ్యాణ్ అహు అంటే.. అదిరి బెదిరి పోయే వాళ్ళము కాదన్నారు.

-Advertisement-సినీ ఇండస్ట్రీపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు !

Related Articles

Latest Articles