జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేము వినాలా : కొడాలి నాని

ఏపీలో రాజకీయాలు రోజురోజు వేడెక్కుతున్నాయి. ఈ రోజు ఉదయం చంద్రబాబు మీడియా ముందు మాట్లాడిన మాటలకు వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రోజా చంద్రబాబును పిచ్చాసుపత్రిలో జాయిన్‌ చేసే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..జగన్ పై నుంచి నీళ్లు పోసాడా..? అని ప్రశ్నించారు. భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అని ఆరోపించారు.

ఓ పది మందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణలు చెప్పాలన్నారు. అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటని ఆయన వాపోయారు. నేను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని జడ్ ప్లస్ వదిలేయమనండి. జూనియర్ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏమిటి..? చంద్రబాబు శిష్యులు మాట్లాడే దానికి కంట్రోల్ చేశారా…?
జూనియర్ ఎన్టీఆర్ చెబితే మేము వినాలా..? అంటూ ప్రశ్నలు కురుపించారు.

నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉంటుందని, వాళ్లు అమాయకులు…ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారు. గొర్రె కసాయి వాడినే న్నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Related Articles

Latest Articles