మరోసారి భగ్గుమన్న ఏపీ రాజకీయం.. చంద్రబాబును ‘చిల్లర నాయుడు’ అన్న కొడాలి

మరోసారి ఏపీ రాజకీయాలు భగ్గుమన్నాయి. నేటి ఉదయం మీడియా ముందుకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. అయితే ఆయన మాటలపై స్పందించిన మంత్రి కొడాలి నాని.. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టం మంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లాల్లో జరిగిన నష్టం అందరికీ తెలుసు… సీఎం వెంటనే స్పందించి అన్నీ చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారు… పునరుద్ధరణకు అధికారులు, మంత్రులతో సమీక్షిస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎదో అన్నారని కుంటి సాకులు చెప్పి అక్కడికి వెళ్ళాడు. ఆయన భార్య పేరు తెస్తే ఆ కుటుంబం మద్దతు ఇస్తుందని చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. ఆయన, ఎల్లో మీడియా ఆమెను అల్లరి అల్లరి చేస్తున్నారని, ఎక్కడ కూడా ఆమెను అసెంబ్లీలో కానీ, బయట కానీ మేము చెప్పలేదన్నారు. ఇలాంటి భర్త, కొడుకు దొరకడం ఆమె దురదృష్టమన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్లి ఏడుపు ముఖం పెడతాడు. అక్కడ వరదల్లో కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరకు వెళ్లి నీ సొల్లు పురాణం ఎందుకు.

అక్కడ పరిష్కారం కానివి ఎమున్నాయో మాకు చెప్పు… వాటన్నిటినీ వదిలేసి నా భార్యను అవమానించారు అని చెప్తాడు. జగన్ ను ఇబ్బంది పెట్టి సోనియా నుంచి నీ కొడుకు వరకు సర్వ నాశనం అయ్యారు. జగన్ పై కేసులు వేసిన వారు ఏమయ్యారో మనం చూశాం. జగన్ ను వేధించిన వాళ్ళకి చంద్రబాబు లాంటి నీచమైన గతి పడుతుంది. వైఎస్సార్ మరణం చాలా గొప్ప మరణం… నీది నీ కొడుకుది కుక్క బతుకు అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

ఈ రోజుకీ వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారు. నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నువ్వు బతికున్నా సచినట్లే లెక్క… పాపి చిరాయువు.. ఒక్కో సీఎం విధానం ఒక్కోలా ఉంటుంది… అన్నీ సహాయక చర్యలు పూర్తయినాక చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి… ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదు. మేమేమి పుష్కరాల్లో గేట్లు మూసేసి షూటింగ్ పెట్టలేదు.. అక్కడ జరిగిన సంఘటనకు ఈయన్ని ఏమి చేయాలి. ఒక్క సారి స్థాయికి మించి వరద వస్తే ఎవరు ఆపగలరు…? అంటూ కొడాలి నాని మండిపడ్డారు.

Related Articles

Latest Articles