భార్యను అల్లరి చేసుకుంటున్న.. రాజకీయ వ్యభిచారి చంద్రబాబు : కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. శవాల మీద చిల్లర ఏరుకునే చిల్లర నాయుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టమంటూ ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు చేసింది మానవ తప్పిదం..భార్యను అల్లరి చేసుకుంటున్న పచ్చి రాజకీయ వ్యభిచారి చంద్రబాబు అంటూ నిప్పులు చెరిగారు. ఓ పది మందిని మా ఇంటికి పంపితే నేనెందుకు క్షమాపణ చెప్పడం ఏమిటి..? అతని భార్యను అతను అల్లరి చేసుకుంటూ నన్ను క్షమాపణ చెప్పమంటాడేమిటి…?అని నిలదీశారు.

తాను సెక్యూరిటీ పెంచుకోవడం లేదు..నేను వదిలేస్తా..ఆయన్ని జడ్ ప్లస్ వదిలేయమనండని సవాల్‌ విసిరారు. ఈ రోజుకీ వైఎస్సార్ ప్రజల గుండెల్లో బతికున్నారు. నువ్వు జగన్ తో పోరాటం చేయలేక పిచ్చి వాగుడు వాగుతున్నావు. నువ్వు బతికున్నా సచినట్లే లెక్క… పాపి చిరాయువు.. ఒక్కో సీఎం విధానం ఒక్కోలా ఉంటుంది… అన్నీ సహాయక చర్యలు పూర్తయినాక చంద్రబాబు వెళ్లారు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి… ఏది పబ్లిసిటీ చేసుకోవాలో కూడా తెలియదంటూ చురకలు అంటించారు.

Related Articles

Latest Articles