సీఎం జ‌గ‌న్ ఒక్కసారి నిర్ణ‌యం తీసుకుంటే వెన‌క్కి త‌గ్గే ప్ర‌సక్తే లేదు : కొడాలి నాని

మూడు రాజధానులను రద్దు చేసుకుంటున్నట్లు జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఏపీ హైకోర్టు లో అపిడవిట్‌ కూడా దాఖలు చేశారు. అలాగే… దీనిపై మరికాసేపట్లోనే.. ఏపీ సీఎం జగన్‌ ప్రకటన చేసే ఛాన్స్‌ ఉంది. ఇలాంటి తరుణంలోనే.. మూడు రాజధానులపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని.. ఈ కారణంగానే న్యాయస్థానంలో బిల్లులు నిలువలేకపోతున్నాయని కొడాలి అన్నారు. అలాగే.. సీఎం జగన్‌ ఒక్కసారి నిర్ణయం తసుకుంటే వెనక్కి తగ్గబోరన్నారు. దీనిపై మరో 10 నిమిషాల్లోనే క్లారిటీ వస్తుందన్నారు.

Related Articles

Latest Articles