కెప్టెన్‌ అంటే ఉదాహరణ కోహ్లీ…

భారత టీ20 జట్టుకు కెప్టెన్ గా తప్పుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ విషయాన్ని ప్రపంచ కప్ ప్రారంభానికి ముందే కోహ్లీ చెప్పిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీ కెప్టెన్సీ లో ఆడిన ఆఖరి టీ20 ప్రపంచ కప్‌ లో టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అభిమానులను నిరాశపర్చింది. ఈ మెగా టోర్నీలో కనీసం సెమీస్‌కు కూడా చేరకుండానే ఇంటిదారిపట్టింది. ఇక ఈ ప్రపంచ కప్ అనంతరం కోహ్లీ న్యాయకత్వ బాధ్యతల నుండి తప్పుకున్న తర్వాత… దాని పై స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ ఓ పోస్ట్ చేశాడు. ఈ టీ 20 ప్రపంచకప్‌ 2021లో మేం నిరాశపరిచాం అని ఒప్పుకున్నా రాహుల్… మా తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతాం. ఇక మేం ఉత్తమ క్రికెటర్లుగా ఎదిగేందుకు మాకు సహకరించిన రవిశాస్త్రికి, గెలుపోటముల్లో టీమిండియాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. ఇక నాయకుడిగా టీమిండియాను ముందుండి నడిపించిన విరాట్‌ కోహ్లీకి ధన్యవాదాలు. కెప్టెన్సీకి విరాట్ ఓ ఉదాహరణగా నిలిచాడు’ అని రాహుల్‌ తన పేర్కొన్నాడు.

Related Articles

Latest Articles