రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు…

భారత జట్టు రేపటి నుండు న్యూజిలాండ్ జట్టుతో మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తలపడనున్న విషయం తెలిసిందే. నవంబర్ 17న జైపూర్‌లో, 19న రాంచీలో, నవంబర్ 21న కోల్‌కతాలో టీ20లు జరుగుతాయి. అయితే ఈ సిరీస్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా… కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవరిస్తున్నాడు. ఇక తాజాగా కేఎల్ రాహుల్ మాట్లాడుతూ… ఎప్పుడు మేము ఒకేసారి ఒక సిరీస్‌ పై మాత్రమే దృష్టి పెడతాము. కాబట్టి ఇప్పుడు మేము ప్రపంచ కప్ పై కాదు ఈ కివీస్ గురించి ఆలోచిస్తున్నాము. అలాగే రోహిత్ శర్మను ప్రశంసించాడు రాహుల్. అతని వ్యూహాలు మరియు ఆటపై అవగాహన నిజంగా ప్రశంసనీయం అని చెప్పాడు. రోహిత్ కెప్టెన్సీలో కొత్తేమీ లేదు అని చెప్పిన రాహుల్… అతను ముంబై ఇండియన్స్‌ కు నాయకత్వం వహించడం మేము చాలా కాలంగా చూస్తున్నాము. కెప్టెన్ గా అతని గణాంకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. తనకి ఆటపై మంచి అవగాహన ఉంది అని రాహుల్ అన్నారు. ఇక క్రికెట్ లో ఏది జరిగినా అది సమిష్టి కృషి అని చెప్పిన రాహుల్… జట్టులోని ఆటగాళ్లందరూ కలిసి ఆడితే విజయం సాధించవచ్చు అన్నాడు.

Related Articles

Latest Articles