ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం…

ఐపీఎల్ 2021 లో ఈరోజు కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. పృథ్వీ షా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడకపోవడంతో శిఖర్ ధావన్ తో కలిసి ఓపెనింగ్ కు వచ్చాడు స్మిత్. అయితే ధావన్ (24) పరుగులు చేసి పెవిలియన్ కు చేరగా స్మిత్ 39 పరుగులతో రాణించాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లలో కెప్టెన్ రిషబ్ పంత్ ఒక్కడే 39 పరుగులతో రెండంకెల స్కోర్ ను సాధించగా మిగితా వారందరు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితం కావడంతో క్యాపిటల్స్ కేవలం 127 పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక కేకేఆర్ బౌలర్లలో వెంకటేష్ అయ్యర్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్ రెండేసి వికెట్లు తీయగా టిమ్ సౌతీ ఒక్క వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో గెలవాలంటే కోల్‌కతా 128 పరుగులు చేస్తే చాలు. కానీ ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్న ఢిల్లీ బౌలర్లను కేకేఆర్ బ్యాట్స్మెన్స్ ఎదుర్కోగలరా… లేదా నేది చూడాలి.

-Advertisement-ఐపీఎల్ 2021 : కేకేఆర్ ముందు స్వల్ప లక్ష్యం...

Related Articles

Latest Articles