పండగ పూట… ప్రాణం తీసిన గాలిపటం మాంజా

సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేయడం సంప్రదాయం. పిల్లలతో సహా పెద్దలు కూడా పండగ సందర్భంగా సరదా పడి గాలిపటాలు ఎగురవేస్తుంటారు. అయితే సంక్రాంతి పండగ ఓ ఇంట్లో మాత్రం విషాదాన్ని నింపింది. చాలా కాలంగా గాలిపటాలకు వాడే మాంజా చాలా ప్రమాదకరమైందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో మాంజా చుట్టుకుని ఆకాశంలోని పక్షులు మృత్యువాతపడిన సందర్భాలున్నాయి. అయితే తాజాగా మాంజా చుట్టుకుని ఓ వ్యక్తి మరణించడం మాత్రం గమనార్హం.

Read Also: సీఈసీ కీలక నిర్ణయం.. ఈనెల 22 వరకు నిషేధాజ్ఞలు పొడిగింపు

వివరాల్లోకి వెళ్తే… తెలంగాణలోని మంచిర్యాల పట్టణంలో భీమయ్య అనే వ్యక్తి తన భార్యతో కలిసి బైకుపై వెళ్తుండగా… గాలిపటం మాంజా గొంతుకు చుట్టుకుంది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న స్పీడ్ కారణంగా మాంజా గొంతులోకి లోతుగా చొచ్చుకుని వెళ్లడంతో 36 ఏళ్ల భీమయ్య అక్కడికక్కడే మరణించాడు. దీంతో భీమయ్య కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

Latest Articles