బస్తీ దావాఖానాలు కేంద్రానివే.. రాష్ట్రం పేరు మార్చింది : కిషన్ రెడ్డి

సీఎం కేసీఆర్‌ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని… మెట్రో రైల్ విషయం లో గతంలోనే చేసుకున్న ఒప్పందాల కు విరుద్ధంగా ఎల్ అండ్ టీ వ్యవహరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మోడీ ఫొటో పెట్టక పోవడానికి కారణం రాజకీయాలేనని… రెండేళ్ల కదా ఈ(కేసీఆర్) ప్రభుత్వం ఉండేదని వెల్లడించారు.

హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని… బస్తీ దావాఖానాలు కేంద్ర ప్రభుత్వానివే.. రాష్ట్రం పేరు మార్చిందని వెల్లడించారు. కేసీఆర్ కిట్ లో కేంద్రం భాగస్వామ్యం ఉందని… డబుల్ బెడ్రూంలలో కూడా కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని వెల్లడించారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది ఆయన శ్రీమతి ఆరోగ్యం కోసమేనని.. అగ్గిపెడతానని కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడన్నారు. ప్రోటోకాల్ అధికారుల తీరుపైన సీఎస్ కు ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు కిషన్‌ రెడ్డి.

Related Articles

Latest Articles