నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర…

ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర జరగనుంది. ఇందుకోసం వస్తున్న కేంద్రమంత్రికి ఘట్కేసర్ వద్ద స్వాగతం పలకనున్నారు మేడ్చల్ జిల్లా బీజేపీ అధికారులు.
నేడు మధ్యహ్నం 12 గంటలకు ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద కిషన్ రెడ్డికి హైదరాబాద్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలకనున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50కిలోమీటర్ల జన ఆశీర్వాద యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు బీజేపీ కార్యాలయం వద్ద బహిరంగ సభ, కిషన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం జరగనుంది.

-Advertisement-నేడు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర...

Related Articles

Latest Articles