క్రేజీ టైటిల్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ

యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం, సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్‌ మండపం’తో గత యేడాది ఆగస్ట్ లో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్‌ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అవి సెట్స్ మీద ఉండగానే ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె నిర్మించే తొలి చిత్రంలో ఆఫర్ అందుకున్నాడు. అలాగే నవంబర్ లో కిరణ్ అబ్బవరం హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి ఓ సినిమాను ప్రారంభించింది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం ఓ మూవీ చేయబోతున్నాడు.

Read Also : “సార్” క్లాసులు మొదలెట్టాడు… ధనుష్ ఆన్ డ్యూటీ

గీతా ఆర్ట్స్ 2 ప్రొడక్షన్ నంబర్ 7గా నిర్మితం కాబోతున్న ఈ సినిమా షూటింగ్ జనవరి 7వ తేదీ ఉదయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో మొదలు కాబోతోంది. ఇది కిరణ్‌ అబ్బవరంకు 7వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “వినరో భాగ్యము విష్ణు కథ” అంటూ టైటిల్ పోస్టర్ ను రివీల్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఈ కొత్త సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. రాబోయే రోజుల్లో మిగిలిన నటీనటులు, సిబ్బంది వివరాలను మేకర్స్ ప్రకటిస్తారు.

క్రేజీ టైటిల్ తో కిరణ్ అబ్బవరం నెక్స్ట్ మూవీ

Related Articles

Latest Articles