వినరో భాగ్యము విష్ణు కథ’ అంటున్న కిరణ్‌ అబ్బవరం!

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై బ‌న్నీ వాసు నిర్మాత‌గా, కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీరా ప‌ర్ధేశీ జంట‌గా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే పేరుతో కొత్త సినిమా శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి అల్లు అర‌వింద్ ముఖ్య అతిధిగా హాజ‌రై పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కిర‌ణ్ అబ్బ‌వ‌రం, క‌శ్మీరా ప‌ర్ధేశీ పై అల్లు అన్విత క్లాప్ నివ్వగా, బ‌న్నీవాసు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సినిమాతో ముర‌ళి కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. గతంలో ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కులు ప్ర‌శాంత్ నీల్, కిషోర్ తిరుమ‌ల ద‌గ్గ‌ర మురళీ కిశోర్ వర్క్ చేశారు. కథానాయిక కశ్మీరా పర్దేశీ ఇంతకు ముందు నాగశౌర్య సరసన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది.

జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కిన ‘పిల్లా నువ్వు లేని జీవితం,‌ భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాలు చక్కని విజయాన్ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వినూత్న‌మైన క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్లు నిర్మాత బ‌న్నీవాసు తెలిపారు. ఈ చిత్రానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు చైత‌న్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చుతున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి స‌హ నిర్మాత‌గా బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ గా స‌త్య‌ గమిడి, శ‌రత్ చంద్ర నాయుడు వ్యవహరిస్తున్నారు.

Related Articles

Latest Articles