కిమ్ సోద‌రికి మ‌రో కీల‌క ప‌ద‌వి… కొరియాలో మొద‌లైన టెన్ష‌న్‌…

ఉత్త‌ర కొరియాలో కిమ్ త‌న సోద‌రికి కీల‌క ప‌ద‌విని అప్ప‌గించారు.  ప్ర‌భుత్వ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యురాలిగా అమెకు ప్ర‌మోష‌న్ ద‌క్కింది.  దీంతో కిమ్  సంబంధించి విదేశీ వ్య‌వ‌హారాల బాధ్య‌త‌ల‌ను అమె చూసుకోబోతున్నారు. అటు అమెరికాతో సంబంధాలు మెరుగుప‌రిచే విష‌యంలో కూడా అమె కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉన్న‌ది.  ఒక‌వైపు శాంతి మ‌త్రం పేరుతో చ‌ర్చ‌లు జ‌రుపుతూనే ద‌క్షిణ కొరియాపై ఒత్తిడి తీసుకొచ్చి కావాల్సిన‌వి చేయించుకోవ‌డంలో కిమ్ సోద‌రి యో జంగ్ దిట్ట‌. అమెరికా- ద‌క్షిణ కొరియాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేస్తున్న స‌మ‌యంలో ఉత్త‌ర‌, ద‌క్షిణ కొరియాల మ‌ధ్య ఏర్పాటు చేసిన స‌మ‌న్వ‌య కార్యాల‌యాన్ని ధ్వంసం చేసి ద‌క్షిణ కొరియాపై ఒత్తిడి తీసుకొచ్చారు.  త‌మ‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్ష‌లు ఎత్తివేస్తేనే చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని హెచ్చ‌రించారు.  అయితే, అణ్వాయుధాల‌ను పూర్తిగా వ‌దిలేస్తేనే ఆంక్ష‌లు ఎత్తివేస్తామ‌ని చెప్ప‌డంతో ఉత్త‌ర కొరియా మ‌రింత రెచ్చిపోయింది. సెప్టెంబ‌ర్ 11 వ తేదీన అణ్వ‌స్త్ర వాహ‌క సామ‌ర్థ్య‌మున్న క్రూయిజ్ క్షిప‌ణిని, క‌దిలే రైలు నుంచి ప్ర‌యోగించే కీల‌క క్షిప‌ణిని ప్ర‌యోగించింది.  అంతే కాదు, ప్ర‌స్తుతం హైప‌ర్ సోనిక్ క్షిప‌ణిని త‌యారు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మైంది ఉత్త‌ర కొరియా.  ఇప్పుడు కిమ్ సోద‌రి కిమ్ యో జంగ్‌కు కీల‌క ప‌ద‌వి అప్ప‌గించ‌డంతో ఉత్తర‌, ద‌క్షిణ కొరియాల మ‌ధ్య సంబంధాలు ఎలా ఉంటాయో అని అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు.  

Read: డ్రాగ‌న్‌కు ధీటుగా… మారిష‌స్‌లో లో ఇండియా స్థావ‌రాలు…

-Advertisement-కిమ్ సోద‌రికి మ‌రో కీల‌క ప‌ద‌వి... కొరియాలో మొద‌లైన టెన్ష‌న్‌...

Related Articles

Latest Articles