టెన్నిస్ లెజెండ్ తో సీనియర్ హీరోయిన్ డేటింగ్ ?

బాలీవుడ్ లో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సర్వ సాధారణం అయిపోయాయి. ఇప్పటికే పలువురు లవ్ బర్డ్స్ కెమెరా కంటికి చిక్కి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా భారతీయ టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కిమ్ శర్మతో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికి సాక్ష్యంగా వారిద్దరి గోవా ట్రిప్ కు సంబంధించిన పిక్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. గోవాలో ఇద్దరూ కలిసి సమయం గడుపుతున్న పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కిమ్ శర్మ… లియాండర్ ఒడిలో కూర్చున్నట్లు కనిపిస్తుంది. ఇక కొంతమంది ఈ జంట మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : మేకింగ్ వీడియో : “రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” ఎలా ఉందంటే..?

మరోవైపు లియాండర్, కిమ్ శర్మలు నిజంగానే రిలేషన్ లో ఉన్నారంటూ బాలీవుడ్ కోడై కూస్తోంది. గోవాలో వీరిద్దరూ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ఆ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కిమ్, లియాండర్ వారి సంబంధం గురించి ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ గాసిప్ రాయుళ్లు మాత్రం ఈ ఇద్దరి గురించి గట్టిగా ప్రచారం చేసే పనిలో పడ్డారు. ఈ డేటింగ్ వార్తలపై కిమ్, లియాండర్ ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో ఈ బ్యూటీకి హర్షవర్ధన్ రాణే అనే హీరోతో ప్రేమాయణం, బ్రేకప్ రెండూ అయిపోయాయి. కాగా కిమ్ శర్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. ముఖ్యంగా “మగధీర” చిత్రంలోని స్పెషల్ డ్యాన్స్ నంబర్ మెరిసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-