‘స్క్వాడ్ గేమ్’ చూశాడని.. కాల్చి చంపిన ప్రభుత్వం

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అక్కడ ఆయన చెప్పిందే శాసనం.. చేసిందే న్యాయం.. ఇప్పటివరకు కిమ్ చేసిన ఆగడాలు తలుచుకుంటే వెన్నులో వణుకుపుట్టక మానదు. అంతేకాదు అక్కడ ప్రజల బాధలను వింటే ఇక్కడ మనం ఎంత ప్రశాంతంగా బతుకుతున్నామో అర్ధమవుతుంది. చిన్న చిన్న విషయాలకే మరణ శిక్ష విధించడం కిమ్ ప్రత్యేకత.. ఇటీవల కరోనా సమయంలో కరోనా వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చిమ్పించిన దురాగత నేత కిమ్. తాజాగా నెట్ ఫ్లిక్స్ సిరీస్ ‘స్క్వాడ్ గేమ్’ ను చూశాడనే నెపంతో ఓ వ్యక్తికి మరణశిక్ష విధించాడు కిమ్. అతిదారుణంగా అతడిని కాల్చి చంపించాడు.

‘స్క్వాడ్ గేమ్’ సిరీస్ గురించి అందరికి తెలిసిందే.. ఈ సిరీస్ లో పెట్టుబడిదారి అయిన దక్షిణ కొరియా క్రూరత్వాన్ని దారుణంగా చూపించారు. డబ్బుకోసం ప్రాణాల్ని పణంగా పెట్టే ఈ సిరీస్ చూడడం ఉత్తర కొరియా సంప్రదాయానికి విరుద్ధమైన అంశాలు. దీంతో ఎవరికి తెలియకుండా చైనా సర్వర్ల నుంచి సిరీస్ ను డౌన్ లోడ్ చేసి ఒక వ్యక్తి సిరీస్ ని చూడడమే కాకుండా మరో ఆరుగురు విద్యార్థులకు ఆ సిరీస్ ని పెన్ డ్రైవ్ ద్వారా అమ్మడని ప్రభుత్వం ఆరోపించింది. అందుకే ఆ వ్యక్తిని ఆధారాలతో పట్టుకున్న ప్రభుత్వం అతడికి కఠిన శిక్ష విధించింది. వెంటనే అతనిని కాల్చి చంపాలని తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా మిగతా ఆరుగురు విద్యార్థులను, వారు చదివే స్కూల్ టీచర్లను విధుల నుంచి తొలగించి ఐదేళ్ల నిర్భంద శిక్ష విధించింది. ఉత్తర కొరియాలో ఎవరైనా విద్వేషాలను రెచ్చగొట్టాలని చుస్తే మొగ్గలోనే వారిని తుంచేస్తామని, అందుకే ఇలా చేశామని అధికారులు చెబుతున్నారు.

Related Articles

Latest Articles