“ఆర్‌సి 15” కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

“వినయ విధేయ రామ” తర్వాత బాలీవుడ్ బ్యూటీ “ఆర్‌సి 15” కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు. “ఆర్‌సి 15” తెలుగు, తమిళం మరియు హిందీలో విడుదల కానుంది. ఈ సినిమాతో మరోసారి రామ్ చరణ్, కియారా అద్వానీ మరోసారి జంటగా కనిపించబోతున్నారు. ఇటీవలే కియారా అద్వానీ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె ఎంపికను అధికారికంగా ప్రకటించారు. యాక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా భావిస్తున్న “ఆర్‌సి 15″కు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సిబ్బందిని త్వరలో ఖరారు చేసి ప్రకటిస్తారు.

Read Also : రిచ్చెస్ట్ రిహానా… విలువ 12,603 కోట్లు!

అయితే తాజాగా ఈ సినిమా కోసం కియారా అద్వానీ పారితోషికం ఎంత తీసుకుంటుంది అనే విషయం ఆసక్తికరంగా మారింది. కియారా అద్వానీ “ఆర్‌సి 15” కోసం ఏకంగా 4.5 కోట్ల రూపాయల పారితోషికాన్ని అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కెరీర్‌లో ఇదే అత్యధిక పారితోషికం అని చెప్పొచ్చు. ఈ వార్తలు గనుక నిజమైతే దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె చేరిపోయినట్టే. నిజానికి ఆ రేంజ్ లో పారితోషికం అందుకునే హీరోయిన్లు సౌత్ లో చాలా తక్కువ. ఆమె సాధారణంగా బాలీవుడ్‌లో ప్రతి ప్రాజెక్ట్‌కి దాదాపు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. కానీ “ఆర్‌సి 15” పాన్-ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి .5 కోట్లు డిమాండ్ చేసిందట. ఎట్టకేలకు దర్శకనిర్మాతలు 4.5 కోట్లకు ఆమెను ఒప్పించగలిగారట. ఇప్పటికే మేకర్స్ ఆమెకు అడ్వాన్స్ చెల్లించారట.

-Advertisement-"ఆర్‌సి 15" కోసం కియారా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?

Related Articles

Latest Articles