బాబాయ్ ఒడిలో అబ్బాయ్ .. సీనియర్ హీరోయిన్ ఏమన్నదంటే..?

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటికి బాబాయ్ వెంకటేష్ తో మంచి అనుభందం ఉంది. అన్న సురేష్ బాబు కొడుకు అయినా ఎక్కువగా వెంకీ చేతుల మీదనే రానా పెరిగాడు. ఇక వీరిద్దరి మధ్య ఉండే ఆ బంధం ఇప్పటికి అలాగే కొనసాగుతోంది. తాజాగా వీరి బంధాన్ని సీనియర్ హీరోయిన్ ఖుష్బూ మరోసారి గుర్తుచేశారు. వెంకటేష్ ఒడిలో చిన్నారి రానా ఆడుకుంటున్న ఫోటోను ఖుష్బూ ట్విట్టర్ వేదికగా పంచుకొంటూ  “హేయ్ జూనియర్, నా వార్డ్ రోబ్ లో ఏం దొరికిందో చూడు.. ఈ జ్ఞాపకాలు మాకెంతో అపురూపం కదా” అంటూ రానాను ట్యాగ్ చేసింది.

ఇక ఈ ఫొటోకు రానా స్పందిస్తూ “వావ్.. వావ్.. ధన్యవాదాలు.. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఈ ఫోటోను కలియుగ పాండవులు సమయంలో తీసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారానే ఖుష్బూ టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ప్రస్తుతం ఈ బాబాయ్- అబ్బాయ్ లు కలిసి నెట్ ఫ్లిక్స్ కోసం రానా నాయుడు అనే సిరీస్ లో నటిస్తున్నారు.

Related Articles

Latest Articles