హ్యాకింగ్‌కు గురైన నటి ఖుష్బూ ఖాతా

సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్‌ ఖాతా మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. గత ఏడాది ఏప్రిల్‌లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరింది. అయితే ప్రస్తుత హ్యాకింగ్‌ ఈ విషయంలో ట్విటర్‌ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి సహాయం లేదని తెలిపింది. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. చూస్తుంటే నా ఖాతాని సస్పెండ్‌ చేసినట్లు ట్విటర్‌ పేర్కొంది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే.. వారికి ముందుగా ధన్యవాదాలు అని పోస్టు చేశారు. ట్విటర్‌లోని కవర్‌ ఇమేజ్‌తో పాటు ఖుష్బూ సుందర్‌గా ఉన్న ఆమె ఖాతా పేరును కాస్త ‘బ్రియాన్‌’గా హ్యాకర్లు మార్చేశారన్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లు, పోస్టులను డిలీట్‌ చేశారన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-