భూముల వేలం: కోకాపేట కంటే ఖానామెట్‌లోనే ఎక్కువ ధర..!

భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్‌ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్‌టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా ఎకరం ధర 48.92 కోట్లుగా వచ్చింది… రూ.160.60 కోట్లతో 2.92 ఎకరాలను మంజీరా కన్‌స్ట్రక్షన్స్‌ కొనుగోలు చేయగా.. రూ.185.98 కోట్లతో 3.69 ఎకరాలు దక్కించుకుంది జీవీపీఆర్‌ లిమిటెడ్‌.. ఇక, రూ.153.09 కోట్లతో 3.15 ఎకరాలు లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌ సొంతం చేసుకోగా.. రూ.137.34 కోట్లతో 3.15 ఎకరాలు కొనేసింది అప్‌టౌన్‌ లైఫ్‌ ప్రాజెక్ట్స్‌.. రూ.92.40 కోట్లతో మరో 2 ఎకరాలను కూడాతన ఖాతాలో వేసుకుంది లింక్‌వెల్‌ టెలీసిస్టమ్స్‌.

also read: నిరుద్యోగులకు అండగా పోరాటం-పవన్ కల్యాణ్‌

అయితే, కోకాపేట భూముల కంటే.. ఎక్కువ ధర పలికాయి ఖానామెట్ భూములు.. కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్‌ ద్వారా హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించగా.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలికింది.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. అవరెజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికింది.. కానీ, అదే ఖానామెట్‌ భూముల విషయానికి వస్తే.. గరిష్టంగా రూ.55 కోట్ల ధర పలికినా.. అవరేజ్‌గా మాత్రం 48.92 కోట్లు వెచ్చించారు.. దీంతో.. కోకాపేట కంటే ఖానామెట్‌లోనే కాసుల వర్షం కురిసిందన్నమాట.. మొత్తంగా.. కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో రూ.2729 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-