ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ ?

ఎల్లుండి ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. రేపు రిజర్వేషన్స్ ప్రకటన ఉంటుంది. కార్పొరేషన్ల తో పాటు కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సిద్దిపేట, అచ్చంపేట తో పాటు మరికొన్నింటికి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా పలు మున్సిపాలిటీల ఎన్నికలకు ఎస్‌ఈసీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ గతంలోనే షెడ్యూల్ ప్రకటించింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్​, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ఈ నెల 3వ తారీఖున ప్రారంభమైంది. ఈ మేరకు పురపాలక శాఖ షెడ్యూల్ ప్రకటించింది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల వివరాలతో వార్డుల వారీ ఓటరు జాబితాలు ప్రకటించనున్నారు. ఆ తర్వాత వార్డుల వారీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

Related Articles

Latest Articles

-Advertisement-