ఖైరతాబాద్ గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం..

ఖైరతాబాద్‌ మహాగణపతి విగ్రహంపై గణేష్‌ ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 నుంచి మండపంలోనే నిమజ్జనం చేయాలని నిర్ణయించింది. అలాగే మట్టి విగ్రహమే పెడతామని ప్రకటించింది. గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయంపై పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు. ఇప్పటికే ప్లాస్టర్‌ ఆఫ్‌ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ నిర్ణయం కీలకంగా మారింది.. కాగా, ఇప్పటివరకూ వినాయక విగ్రహాన్ని ట్యాంక్ బండ్ హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తూ వచ్చారు. అయితే వినాయక నిమజ్జనానికి హైకోర్టు అనుమతి నిరాకరించింది. హుస్సేన్‌‌సాగర్‌ కాలుష్యకాసారంగా మారిందని, అందులో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. ఈ ఒక్క ఏడాది వరకు పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జీహెచ్‌ఎంసీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో మహాగణపతిపై ఉత్సవ కమిటీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-