‘కేజీఎఫ్ 2’ థియేట్రికల్ రైట్స్ సోల్డ్ అవుట్! విడుదలకి మొదలైన కౌంట్ డౌన్…

‘కేజీఎఫ్’తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, యశ్ మరోసారి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’తో మన ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్స్ వల్ల అన్ని సినిమాల్లాగే ‘కేజీఎఫ్ 2’ కూడా బాగా ఆలస్యమైంది. కానీ, రాకింగ్ స్టార్ యశ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ తెర మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది. ఇంకా అధికారికంగా రాకీ భాయ్ ఎప్పుడు వస్తాడో ఫిల్మ్ మేకర్స్ ప్రకటించలేదు. కానీ, తెర వెనుక ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ బిజినెస్ వ్యవహారాలైతే చురుగ్గా సాగుతున్నాయి. తాజా ట్వీట్ చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది…

ప్రొడ్యూసర్ ఎస్ఆర్ ‘బిగ్ న్యూస్ అరైవింగ్ సూన్’ అంటూ ఓ ట్వీట్ షేర్ చేయటంతో ఇప్పుడు నెటిజన్స్ ‘కేజీఎఫ్’ చర్చల్లో మునిగిపోయారు. ‘గ్యాంగ్ స్టర్స్ తో హాలు నిండిపోయినప్పుడే మాన్ స్టర్ వస్తాడు. ఆయన న్యూ అరైవల్ డేట్ త్వరలో ప్రకటిస్తాం’ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ విడుదల చేశారు! దాంతో ‘కేజీఎఫ్’ అభిమానుల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే కాదు, తాజా ట్వీట్ లో డ్రీమ్ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సంస్థను కూడా ట్యాగ్ చేయటంతో ‘చాప్టర్ 2’ థియేట్రికల్ హక్కులు అదే కంపెనికి దక్కాయని అంటున్నారు. కేరళ నుంచీ ‘పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్’ని ట్యాగ్ చేశారు. మల్లూవుడ్ లో ‘కేజీఎఫ్ 2’ని పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ ప్రేక్షకులకి అందిస్తుందని మనం భావించాలి…

‘కేజీఎఫ్ చాప్టర్ 1’ సైలెంట్ గా వచ్చి ప్యాన్ ఇండియా సెన్సేషన్ గా మారింది. ‘చాప్టర్ 2’కి ఎక్కడలేని క్రేజ్ ఏర్పడటంతో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ బిగ్గీస్ ని కూడా బరిలోకి దింపారు. చూడాలి మరి, శాండల్ వుడ్ ఎపిక్ గ్యాంగ్ స్టర్ మూవీ దేశ వ్యాప్తంగా మరోమారు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-