రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఇదే… IAFకు కీలక నివేదిక

భారత త్రిదళాధిపతి బిపిన్​ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా విచారణ కమిటీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌(IAF)కు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఈ ప్రమాదానికి మెకానికల్ ఫెయిల్యూర్, కుట్ర, నిర్లక్ష్యం కారణం కాదని నివేదిక స్పష్టం చేసింది. వాతావరణంలో అనూహ్య మార్పుల వల్లే ప్రమాదం జరిగిందని.. కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ విఫలమయ్యాడని నివేదిక పేర్కొంది.

Read Also: కేంద్ర పొగాకు బోర్డు సభ్యుడిగా బీజేపీ ఎంపీ జీవీఎల్ ఎన్నిక

కాగా గతేడాది డిసెంబర్ 8న జరిగిన ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ సహా 14 మంది సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రివిధ దళాల ఉన్నతాధికారులతో ఎయిర్‌ఫోర్స్ ఏర్పాటు చేసిన కమిటీ ఈమేరకు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై విచారణ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది.

Related Articles

Latest Articles