కిమ్ సోద‌రికి కీల‌క ప‌ద‌వి… దానికోస‌మేనా…!!

ఉత్త‌ర కొరియా గురించిన ఎలాంటి చిన్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చినా అది వెంట‌నే వైర‌ల్ గా మార‌టం స‌హ‌జ‌మే.  ఆ దేశంలో జ‌రిగే విష‌యాలు ఎప్పుడూ ప్ర‌పంచాన్ని ఆక‌ర్షిస్తుంటాయి.  గ‌త కొంత‌కాలంగా కిమ్ అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు.  ఆయ‌న‌కు ఆరోగ్యం బాగాలేద‌ని వార్త‌లు అధికంగా వ‌చ్చే స‌మయంలో ఆయ‌న‌కు సంబంధించిన ఫొటోల‌ను ఉత్త‌ర కొరియా అధికారిక మీడియా ప్ర‌చురిస్తుంటుంది.  అయితే, ఆయ‌న ఆకారంలో వ‌చ్చిన మార్పుల‌ను బ‌ట్టి కొన్ని ర‌కాల ఆరోగ్య‌స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నార‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఇక ఇదిలా ఉంటే, కిమ్ త‌రువాత ఆ ప‌ద‌విని ఎవ‌రికి అప్ప‌గించ‌బోతున్నారు అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  కిమ్ త‌న సోద‌రి కిమ్ యో జంగ్‌ను దేశాధ్య‌క్షురాలిగా ప్ర‌క‌టిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ నేప‌థ్యంలో కిమ్ సోద‌రికి పార్టీ నార్త్ కొరియా స్టేట్ ఎఫైర్స్ క‌మిటీలో కీల‌క ప‌ద‌విని క‌ట్ట‌బెట్టింది.  కిమ్ యో జంగ్ నియామ‌కానికి సుప్రీం పీపుల్స్ అసెంబ్లీసైతం ఆమోద ముద్ర‌ను వేసింది.  దీంతో అధ్య‌క్షుడు కిమ్ త‌రువాత ఆయ‌న సోద‌రికి అధ్య‌క్షురాలిగా నియామ‌కం జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు.  వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను తావు లేకుండా చేయాల‌ని గ‌తంలో అద్య‌క్షుడు నిర్ణ‌యం తీసుకున్నా, ఆ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా కిమ్ సోద‌రికి కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  

Read: అమ‌రీంద‌ర్ సింగ్ సంచల‌న వ్యాఖ్య‌లు: పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక‌ త‌ప్ప‌దు

-Advertisement-కిమ్ సోద‌రికి కీల‌క ప‌ద‌వి... దానికోస‌మేనా...!!

Related Articles

Latest Articles