తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ నియామక ప్రక్రియపై పంచాయతీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పదవి నాకు కావాలి.. అంటే నాకు అంటూ పోటీ పడుతున్నారు నేతలు. పదవి కోసం పోటీ పడటం సహజమే. అయితే, నాకు పదవి వచ్చినా రాకపోయినా… పక్కోడికి మాత్రం రావొద్దు అనే తరహా ఫిర్యాదులు చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకంపై కీలక భేటీ నిర్వహించనుంది కాంగ్రెస్ అధిష్టానం. సోనియా గాంధీ నివాసంలో ఈ సమావేశం జరుగనుంది. సోనియా గాంధీతో భేటీ కానున్నారు తెలంగాణ ఇంచార్జ్ మాణిక్ ఠాగూర్. దీంతో ఏ క్షణంలోనైనా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోనియా గాంధీని ఏ క్షణంలో నైనా మాణిక్ ఠాగూర్ కలిసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే పీసీసీపై ఈ రోజు సమావేశంలో అంతిమ నిర్ణయం కానున్నట్లు సమాచారం. ఏ క్షణంలో నైనా అధిష్ఠానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-