పవన్ ట్వీట్​పై తమిళనాడు అసెంబ్లీలో కీలక చర్చ !

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కు ఫాలోయింగ్‌ ఏ రేంజ్‌ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు పవన్‌ కళ్యాణ్‌ అంటే ఇష్టపడని వారుండరు. అయితే… తాజాగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. చేసిన ఓ ట్వీట్‌ పై తమిళనాడు శాసనసభలో చర్చ జరిగింది. శాసనసభలో ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ ప్రసంగిస్తూ.. ఓ ట్వీట్‌ గురించి ప్రస్తావించారు. ప్రతి పక్షం, అధికార పక్షం అనే తేడా లేకుండా తమిళనాడు ముఖ్యమంతరి స్టాలిన్‌ అందరినీ భాగస్వాములను చేస్తూ… వారికి సముచిత గౌరవం కల్పిస్తూ.. పరిపాలన చేస్తుండడాన్ని పవన్‌ తన ట్వీట్‌ లో ప్రశంసించారు. ప్రభుత్వలోకి రావడానికి రాజకీయాలు చేయాలే తప్ప.. అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదనే మాటలను చేతల్లో చూపి.. అధికారంలోకి వచ్చాక రాజకీయ చేయకూడదనే మాటలను చేతల్లో చూపిస్తున్నారని ఆరోగ్య మంత్రి సుబ్రమనియన్‌ తమిళనాడు శాసన సభలో తమిళంతో పాటు తెలగులోనూ తెలిపారు.

Related Articles

Latest Articles

-Advertisement-