తెలుగు అకాడమీ స్కామ్‌ కేసు… కీలక పరిణామాలు

తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్‌ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.. తెలుగు అకాడమీ కేసులో ఏ-1 నిందితుడుగా ఉన్న యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలిని కస్టడికి అనుమతించింది నాంపల్లి కోర్టు.. రేపటి నుండి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీలోకి అనుమతించింది కోర్టు.. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్న మస్తాన్ వలీని రేపు కస్టడీలోకి తీసుకోనున్నారు సీసీఎస్ పోలీసులు. మరోవైపు నిధుల గోల్డ్ మాల్ పాలడ్డ ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేశారు సీసీఎస్ పోలీసులు.. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు.. యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలి తో కలిసి ఫిక్స్డ్ డిపాజిట్లను కొల్లగొట్టింది ఈ ముఠా.. ఇప్పటికే ఈ కేసులో నలుగురిని అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు.. తాజాగా ఆరుగురిని ఆదుపులోకి తీసుకున్నారు.. ముఠా దగ్గర నుంచి కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.. శ్రీనివాస్, రాజ్ కుమార్, సోమశేఖర్ లతోపాటు మరో ముగ్గురు సీసీఎస్‌ అదుపులో ఉన్నారు. గతంలోనూ కొన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఎఫ్‌డీలను ఈ ముఠా కాజేసినట్టు తెలుస్తోంది.. ఇక, రేపు ఆరుగురిని అధికారికంగా అరెస్ట్‌ చూపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

-Advertisement-తెలుగు అకాడమీ స్కామ్‌ కేసు... కీలక పరిణామాలు

Related Articles

Latest Articles