బెడ్ రూమ్ లో ఒకరి భార్యతో మరొకరు.. పోలీసులకు అడ్డంగా దొరికి

భారతదేశంలో వివాహ బంధానికి ఒక విలువ ఉంది.. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా ఆ వివాహ బంధమే వారిని కాపాడుతోంది. కానీ ఇటీవల సమాజంలో భార్యాభర్తల మధ్య బంధం చూస్తుంటే సిగ్గేస్తోంది. వారు చేసే పనులకు సమాజం తల దించుకొంటుంది. శృంగారానికి అలవాటు పడిన వారు వావివరుసలు మరిచి, విచక్షణ మరిచి పరాయి వారి భార్యలతో శృంగారానికి సై అంటున్నారు. దీనికి పోష్ గా పెట్టుకున్న పేరే పార్టనర్ ఎక్స్ చేంజ్.. తాజాగా కేరళలో ఈ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. బలవంతంగా భార్యల మార్పిడి పద్దతిలో శృంగారం చేస్తున్న కొంతమంది జంటలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళకు చెందిన ఒక వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అతడు భార్యతో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు.. ఆమెను చిత్ర హింసలకు గురిచేసేవాడు.అంతే కాకుండా తన స్నేహితులను ఇంటికి పిలిచి వారితో భార్యను శృంగారం చేయమని బలవంతపెట్టేవాడు. ఇలా అతను, అతని స్నేహితులు కలిసి భార్యల మార్పిడి రాకెట్ ని నడపడం మొదలుపెట్టారు. ఒకరి భార్యతో మరొకరు రోజంతా ఎంజాయ్ చేసేవారు. టెలిగ్రామ్, మెసెంజర్ లో ఒకరినొకరు కనెక్ట్ అవుతారు. తమ భార్యలను తీసుకెళ్లి వేరొకరికి ఇచ్చి వేరొకరి భార్యను తెచ్చుకుంటారు. ఇప్పటివరకు 1000 జంటలు ఈ గ్రూపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అనైతికమైన శృంగార రాకెట్ పై సదురు వ్యక్తి భార్య పోలీసులకు తెలుపడంతో వీరి గుట్టు బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles