దారుణం: ఆ పనికి ఒప్పుకోలేదని.. చర్చికి పిలిచి యాసిడ్ పోసిన మహిళ

ఫేస్ బుక్ ప్రేమలు.. ఎక్కడి వరకు వెళ్తున్నాయో ఎవరికి తెలియడంలేదు. ముక్కు ముఖం తెలియని వారి ప్రేమలో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత.. తాజాగా ఒక యువకుడు ఫేస్ బుక్ ప్రేమ అతడి ప్రాణం మీదకు తెచ్చింది. ఈ ఘటన కేరళ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే యువకుడికి కొద్దీ రోజుల క్రిత్రం ఫేస్ బుక్ లో షీబా అనే మహిళ పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే షీబాకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయాన్ని అరుణ్ వద్ద దాచిపెట్టి చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. అయితే నిజం ఎక్కువ రోజులు దాగలేదన్నట్లు ఒకరోజు షీబా గుట్టు బయటపడింది. ఆమె భర్తకు విడాకులు ఇచ్చి, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటుందని తెలుసుకున్న అరుణ్ ఆమెను దూరం పెట్టాడు. దీంతో అతడిపై రగిలిపోయిన ఆమె అరుణ్ ని బెదిరించడం మొదలు పెట్టింది.

తనను పెళ్లి చేసుకోకపోతే పంచాయితీ పెట్టి పరువు తీస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసింది. ఇక దీంతో అరుణ్ తన స్నేహితుడిని తీసుకొని ఒక చర్చి వద్ద డబ్బు ఇవ్వడానికి వెళ్ళాడు. అక్కడ మరోసారి వీరిద్దరి మధ్య పెళ్లి చర్చ జరిగింది. షీబాను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు అరుణ్. దీంతో రగిలిపోయిన ఆమె తనతో తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ని అతడి ముఖంపై కొట్టడంతో అతడి ముఖం సగం కాలిపోయింది. ప్రస్తుతం అరుణ్‌ కుమార్‌కు తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స జరగుతుంది. యాసిడ్‌ దాడిలో అరుణ్‌ కుమార్‌ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. షీబాను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Related Articles

Latest Articles