మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగించిన కేర‌ళ‌

క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది కేర‌ళ‌.. గ‌తంలో ఇచ్చిన స‌డ‌లింపులు య‌థావిథిగా కొన‌సాగుతాయ‌ని ప్ర‌క‌టించింది.. కేర‌ళ‌లో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల 16వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ పొడిగించిన‌ట్టు లెఫ్ట్ స‌ర్కార్ పేర్కొంది.. ఇక‌, ఈనెల 12, 13 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమ‌లు చేయ‌నున్నారు.. ఈ స‌మ‌యంలో నిత్యావ‌స‌రాల షాపులు, ప‌రిశ్ర‌మ‌ల‌కు ముడిప‌దార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్య‌కలాపాలతో పాటు బ్యాంకులు య‌థావిథిగా ప‌నిచేయ‌నున్నాయి.. కాగా, కేర‌ళ‌లో క‌రోనా మృతుల సంఖ్‌య 10 వేల మార్క్‌ను క్రాస్ చేసింది.. తాజాగా 9,313 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. మ‌రో 221 మంది మృతిచెందారు.. ఇదే స‌మ‌యంలో 21,291 మంది రిక‌వ‌రీ అయ్యారు.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 1,47,830 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-