కేరళలో తగ్గని కరోనా తీవ్రత

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. కేరళలో ఇంకా భారీగానే పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి.. కేరళ సర్కార్‌ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 13,772 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 142 మంది మరణించారు.. ఇదే సమయంలో 11,414 మంది కరోనా బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,25,466కు చేరుకోగా.. రికవరీ కేసులు 29,00,600కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు కరోనాబారిన పడి 14,250 మంది ప్రాణాలు వదిలారు.. కేరళ సర్కార్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా.. కోవిడ్ కేసులు ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి..

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-