కేరళలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గుతున్నా.. కేరళలో మాత్రం పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. కోవిడ్‌ కేసులు హాట్‌స్పాట్‌గా మారిపోయింది కేరళ.. అయితే, ఇవాళ మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గాయి.. కేరళ సర్కార్‌ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,699 కోవిడ్‌ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 58 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ఇక, ఒకే రోజులు 17,763 మంది కరోనా మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 46,41,614కు పెరిగింది. రికవరీ కేసులు 44,59,193కు చేరగా.. క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 24,661కి పెరిగింది.. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1,57,158 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.

-Advertisement-కేరళలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు

Related Articles

Latest Articles