కేరళలో మళ్లీ భారీగా కోవిడ్‌ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కేరళలో మాత్రం పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వచ్చాయి.. అయితే, గత కొంతకాలంగా కాస్త తగ్గుముఖం పట్టాయి రోజువారీ కేసులు.. కానీ, మరోసారి 10 వేల మార్క్‌ను దాటేశాయి.. కేరళ ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 11,079 కరోనా కేసులు నమోదు కాగా.. 123 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇదే సమయంలో 19,745 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్… దీంతో.. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 48,20,698కు చేరుకోగా.. మరణాల సంఖ్య 26,571కు పెరిగింది.. రికవరీ కేసుల సంఖ్య 46,95,904కు చేరుకుంది.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 97,630 యాక్టివ్ ‌కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేరళ సర్కార్.

-Advertisement-కేరళలో మళ్లీ భారీగా కోవిడ్‌ కేసులు

Related Articles

Latest Articles