కేర‌ళ‌ను వ‌ద‌ల‌ని క‌రోనా: ఈరోజు కూడా…

కేరళలో క‌రోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  దేశంలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నా, కేరళలో మాత్రం అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.  ఆరోజు కూడా కేరళలో అత్యధికంగా 22,064 కేసులు నమోదయ్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 33,49,365కి చేరింది.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో కేర‌ళ‌లో క‌రోనాతో 128 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో న‌మోదైన మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 16,585కి చేరింది.  రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈనెల 31, ఆగ‌స్టు 1 వ తేదీన సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌కటించింది.  కేర‌ళ‌లో కేసులు పెరుగుతుండ‌టంతో దేశంలో ఆందోళ‌న మొద‌లైంది.  కేసులు పెరుగుతుండ‌టం చూస్తుంటే థ‌ర్డ్ వేవ్ మొద‌లైందేమో అని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌లు చెందుతున్నారు. 

Read: ఏపీ కాంగ్రెస్‌పై రాహుల్ దృష్టి…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-