ఆటో డ్రైవ‌ర్ ఇంట్లో భోజ‌నం చేసిన సీఎం..!

ఢిల్లీ ముఖ్యమంత్రి… అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీఎం పదవిలో ఉన్నప్పటికీ ఆయన మామూలు వ్యక్తిగానే వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన ఓ సాధారణ ఆటోడ్రైవర్ ఇంట్లో భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రస్తుతం ఆయన లూధియానాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దిలీప్ తివారి అనే ఆటో డ్రైవర్.. సీఎం గారు మీరు చాలా మంది ఆటోడ్రైవర్లకు సాయం చేశారు… ఈ పేద ఆటోడ్రైవర్ ఇంటికి భోజనం చేయడానికి రాగలరా అంటూ ఆహ్వానించాడు.

దీంతో వెంటనే కేజ్రీవాల్ అతడు ఇంటికి వెళ్ళి అతడి కుటుంబ సభ్యులతో… కలిసి భోజనం చేశాడు. సీఎం కేజ్రీవాల్ వారితో భోజనం చేయడంతో… ఆ కుటుంబ సభ్యుల ముఖాల్లో ఆనందం వెలిగి పోయింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఈ ఫోటోలు చూసిన అన్ని డిజైన్లు ఫిదా అవుతున్నారు.

Related Articles

Latest Articles