కరోనా బారిన పడ్డ ‘మహానటి’..

చిత్రపరిశ్రమను కరోనా వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. ” నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలను అనుభవిస్తున్నాను. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారు కూడా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని, జాగ్రత్తగా ఉన్నా కూడా నేను కరోనా బారిన పడ్డాను. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయించుకోలేదో వారందరు వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటె వ్యాక్సిన్ వలన తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు.. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు.. త్వరగా కోలుకొని మళ్లీ యాక్షన్లోకి దిగుతాను” అంటూ చెప్పుకొచ్చింది. ‘మహానటి’ చిత్రంతో అందరికి చేరువైన కీర్తి ప్రస్తుతం మహేష్ సరసన ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తోంది.

Related Articles

Latest Articles