తమిళ స్టార్ హీరో సరసన కీర్తి సురేష్?

తమిళ స్టార్ నటుడు విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు దీనిని పాన్ ఇండియా మూవీగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో ముద్దుగుమ్మ కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపిక అయినట్లు తెలుస్తుంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ కీర్తితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. గతంలో విజయ్ కు జోడీగా సర్కార్ సినిమాలో నటించింది కీర్తి. ఇప్పుడు మరోసారి విజయ్ సినిమాలో నటించనున్నట్లు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. కాగా ప్రస్తుతం కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-