రశ్మికని రాక్ స్టార్ అంటూ కీర్తించిన కీర్తి!

ఇంకా బాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కాలు మోపలేదు రశ్మిక మందణ్ణ. ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్నూ’ పూర్తి చేసింది. అమితాబ్, నీనా గుప్త కీలక పాత్రలు పోషిస్తోన్న ‘గుడ్ బై’ సినిమా షూటింగ్ కూడా ముగిసింది. అయితే, తన ఫస్ట్ టూ మూవీస్ ఇంకా రిలీజ్ కాకపోయినా రశ్మిక మాత్రం బీ-టౌన్ లో దుమారం రేపుతోంది. పాప్ సింగర్ బాద్షాతో ఓ వీడియో సాంగ్ లో ఆడిపాడిన అందాల రాశి హిందీ ఆడియన్స్ కి ఆల్రెడీ దగ్గరైంది. ముంబై పాపరాజీ మీడియాకైతే ఈ కన్నడ పాప ‘నేషనల్ క్రష్’గా మారిపోయింది. మరి ఇంత సొషల్ మీడియా క్రేజ్ పెరిగాక ఫాలోయర్స్ సంఖ్య పెరగదా? అదే జరుగుతోంది…

రశ్మిక మందణ్ణ ఇన్ స్టాగ్రామ్ ఇప్పుడు 20 మిలియన్ ఫాలోయర్స్ లో కళకళలాడుతోంది. అంటే, 2 కోట్ల మంది మన ‘భీష్మ’ బ్యూటీకి ఫిదా అయ్యారన్నమాట. తన లేటెస్ట్ రికార్డుని సెలబ్రేట్ చేసుకుంటూ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది బెంగుళూరు బ్యూటీ. అదరిపోయే ఫోటో ఒకటి పోస్ట్ చేసిన ఆమె ‘ఫీలింగ్ ద ట్వంటీ మిలియన్ బీ లైక్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ‘లవ్ యూ’ అంటూ ఫాలోయర్స్ ని ప్రేమలో ముంచేసింది.

రశ్మిక తన 20 మిలియన్ మైల్ స్టోన్ సంగతి ప్రకటించగానే కీర్తి సురేశ్ శుభాకాంక్షలు తెలిపింది. ‘రాక్ స్టార్’ అంటూ కీర్తి కీర్తించింది. మరోవైపు, ఎల్లీ అవ్రామ్ కూడా ‘సో ప్రెటీ’ అంటూ క్యూట్ కామెంట్ డ్రాప్ చేసింది.
నెక్ట్స్ రశ్మిక మన తెలుగు తెరపైకి ‘పుష్ప’ సినిమాతో రాబోతోంది. తమిళంలోనూ ‘సరిలేరు నీకెవ్వరు’ సుందరి క్రమంగా క్రేజ్ పెంచుకుంటోంది…

-Advertisement-రశ్మికని రాక్ స్టార్ అంటూ కీర్తించిన కీర్తి!

Related Articles

Latest Articles