కేసీఆర్ వ్యూహం: బీజేపీకి మైనస్.. రేవంత్ కు ప్లస్?

హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వేవ్ కొనసాగుతోంది. అయితే ఈటలను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలని సీఎం కేసీఆర్ పకడ్బంధీగా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోటీ మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి ఎన్నిక ఇది కావడంతో ఆయనకు పరీక్ష మారునుంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నియోజకవర్గంలో పాదయాత్రతో దూసుకెళుతున్నారు. హుజూరాబాద్లో ఆయన చేసిన అభివృద్ది, సానుభూతి పవనాలను ఈ ఎన్నికల్లో ఆయనకు కలిసి వస్తాయని అంతా భావిస్తున్నారు. టీఆర్ఎస్ సైతం తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించి బరిలో నిలిచింది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. ఇలాంటి సమయంలోనే హూజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రధాన ప్రత్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీలుచిక్కినప్పుడల్లా ఆయన టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు చేస్తూ ప్రజల్లో తనకంటూ ఓ ఇమేజ్ ను తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి దక్కింది. రేవంత్ పీసీసీ అయ్యాక టీఆర్ఎస్ పై మరింత దూకుడు పెంచారు. స‌భ‌లు ర్యాలీల పేరుతో కేసీఆర్‌ను స‌వాల్ విసురుతున్నారు. ఈక్రమంలోనే హూజూరాబాద్లో సైతం కాంగ్రెస్ పార్టీని గౌరవప్రదమైన ప్లేసులో ఉంచాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ ఎన్నిక ఫలితం వచ్చే ఎన్నికలపై ఉండనున్న నేపథ్యంలో కాంగ్రెస్ కనీసం రెండో ప్లేసును దక్కించుకున్న నైతికంగా విజయం సాధించినట్లేననే మాటలు విన్పిస్తున్నాయి.

ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీలు దూసుకెళుతుండగా కాంగ్రెస్ మాత్రం అభ్యర్థిని ప్రకటించ లేదు. బలమైన అభ్యర్థి కోసం వెతుకుతూనే ఉంది. కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లాంటి తెరపైకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నికను వాయిదా పడటం రేవంత్ కు కలిసొచ్చింది. మరోవైపు ఈ పరిణమం బీజేపీకి మైనస్ గా మారింది. క‌రోనా ప‌రిస్థితుల దృష్ట్యా పండ‌గ‌ల సీజ‌న్ త‌ర్వాతే హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వ‌హించాల‌నే టీఆర్ఎస్ సర్కారు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని కోరగా ఎన్నికను వాయిదా వేసింది.

దీపావ‌ళి త‌ర్వాతే హుజురాబాద్ ఉప ఎన్నిక ఉంటుందనే సంకేతాలను ఇచ్చింది. రేవంత్ కు ప్రస్తుతం సమయం కలిసి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థిపై ఆయన దృష్టిసారించే అవకాశం ఉంది. ఏదిఏమైనా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రేవంత్ కలిసి వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-