కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు : కేటీఆర్‌

కేసీఆర్ మానస పుత్రిక రైతుబంధు అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మధ్య పొలిటికల్ టూరిస్ట్‌లు వచ్చి ఏదోదే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా 64 లక్షల మంది రైతుల ఖాతాలోకి 50 వేల కోట్లు జమ అయ్యిందని, తెలంగాణ రాకంటే ముందు ఈ ప్రాంత పరిస్థితి బోర్ల కింద పంటలు..

బోర్ల పడ్డ బతుకులుగా ఉండేవన్నారు. సమైక్య పాలనలో తెలంగాణ రైతులు నానా కష్టాలు పడ్డారని, ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు కనీస మద్దతు ధర ఉండేది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు రైతుల ఆత్మహత్యలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ వన్ గా ఉండేదని, పాలకులు మారిన అన్నం పెట్టిన రైతుకు సున్నం పెట్టిన నేతలు నాటి సమైక్య పాలకులని ఆయన విమర్శించారు.

Related Articles

Latest Articles