కేంద్రంపై కేసీఆర్‌ గరం.. గరం..

ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సోమవారం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించిందని అన్నారు. రైతు, పేదల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా దేశ ఆహార భద్రత కోసం బఫర్‌ స్టాక్స్‌ పెడుతుందని, రాజ్యాంగం ప్రకారం కేంద్రంపై బాధ్యత ఉందన్నారు. కోట్ల మంది బాధ్యతలను చూసే కేంద్రం చిల్లర కొట్టు యజమానిలా వ్యవహరించకూడదని హితవు పలికారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దేశ రైతుల్నే గందరగోళంలోకి నెడుతోందన్నారు. లక్ష కోట్ల నష్టం వచ్చినా భరించాల్సిన బాధ్యతత కేంద్రంపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని ఆ నిందను రాష్ట్రంపై నెడుతోందన్నారు. ఇంత దిగజారిన కేంద్ర ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదని కేసీఆర్‌ చురకలు అంటించారు.

మెడపై కత్తిపెట్టి లేఖ రాయించుకున్నారని..కేంద్రానివి అన్నీ డొంకతిరుగుడు మాటలే అంటూ ఆయన ధ్వజమెత్తారు. బాయిల్డ్‌ రైస్‌ గింజ కూడా తీసుకోబోమని చెప్పారని, రా రైస్‌ ఎంత తీసుకుంటారో కూడా చెప్పడం లేదంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles