టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్.రమణ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. 12 మందిలో ఏడుగురు కొత్తవారికి స్థానం కల్పించారు. వీటిలో బీసీలకు 4, ఓసీలకు 7, ఎస్సీలకు 1 కేటాయించారు. 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సోమవారం ఉదయం నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు ముగియనుంది.

Read Also: వాట్సాప్‌లో ఫైల్ పంపుతున్నారా? ఈ విషయం మీకు తెలుసా?

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు. మహబూబ్‌నగర్‌లో ఒకరికి‌, కరీంనగర్‌లో ఒకరికి కొత్తవారికి అవకాశం కల్పించారు. కాగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఎల్.రమణకు ఛాన్స్ ఇచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల ముందే.. ఎల్ . రమణ టీడీపీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బీసీ నేత, కరీంనగర్ జిల్లా కావడంతో ఎల్.రమణ ఎమ్మెల్సీ ఛాన్స్ దక్కింది. ఖమ్మం నుంచి తాత మధు, ఆదిలాబాద్ నుంచి దండె విఠల్, మహబూబ్‌నగర్-2 నుంచి సాయిచంద్, కరీంనగర్-2 నుంచి ఎల్.రమణ, నల్గొండ నుంచి కోటిరెడ్డి, మెదక్ నుంచి యాదవ్‌రెడ్డి, నిజామాబాద్ నుంచి ఆకుల లలితకు కొత్తగా అవకాశం కల్పించారు. మహబూబ్ నగర్ -1 నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్-1 నుంచి భానుప్రసాద్, రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాలకు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీలలో పురాణం సతీష్, నారదాసు, దామోదర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, బాలసాని లక్ష్మీనారాయణ, చిన్నపరెడ్డి, కవిత స్థానాలు గల్లంతయ్యాయి.

Related Articles

Latest Articles