ఎమ్మెల్సీ అభ్యర్థులను ఫైనల్‌ చేసిన కేసీఆర్..ఏడుగురు కొత్త వారే !

తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు ప్రజల్లో ఇటు పార్టీలో… అసంతృప్తి రాకుండా ఉండేందుకు ఇప్పటినుంచే… కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. అయితే రేపు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నిన్న రాత్రి ప్రగతి భవన్ లో మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా 12 మంది అభ్యర్థులను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈ 12 మందిలో… సగం కంటే ఎక్కువ… అంటే ఏకంగా ఏడుగురిని కొత్త వాళ్లను ఫైనల్ చేశారు సీఎం కేసీఆర్. అయితే ఈ 12 మంది సభ్యులు ఎవరనే దానిపై… సీఎం కేసీఆర్ వెల్లడించలేదు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించకుండానే రేపు నామినేషన్లను దాఖలు చేయాలని గులాబీ బాస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కెసిఆర్ నిర్ణయంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు టెన్షన్ నెలకొంది. అసలు ఎవరు ఆ పన్నెండు మంది సభ్యులు ఎవరనే గందరగోళం అందరిలోనూ నెలకొంది. దీని పై క్లారిటీ రావాలంటే మరో 24 గంటలు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles