చరణ్ పై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

యంగ్ బ్యూటీ కావ్య థాపర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ నెస్ తో హీట్ పెంచేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన కామెడీ ఎంటర్టైనర్ “ఏక్ మినీ కథ”తో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. అయితే ఈ సినిమాలో చాలా పద్ధతిగా కన్పించిన ఈ భామ.. సోషల్ మీడియాలో మాత్రం హద్దులు చెరిపేసి అందాలు ఆరబోసేస్తోంది. దీంతో యూత్ అంతా ఈ బ్యూటీ గ్లామర్ కు ఫిదా అవుతున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఈ హాట్ భామ వయ్యారాలు ఒలకబోసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.“నేను రామ్ చరణ్ కు ఫ్యాన్ ను. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. అతను టాలీవుడ్లో నా అభిమాన నటుడు. చరణ్ తనను తాను తెరపై ప్రదర్శించే విధానం నాకు చాలా ఇష్టం. ఇంకా చిరంజీవి, జూనియర్ ఎన్‌టిఆర్‌లు కూడా ఇష్టం. ఈ ఇద్దరు టాలీవుడ్‌లో నాకు ఇష్టమైన డాన్సర్లు” అంటూ చెప్పుకొచ్చింది కావ్య. మరి రానున్న కాలంలో వీరిలో ఏ హీరోతో కావ్య జతకడుతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-