పెళ్ళి తరువాత కత్రినా మార్చుకోనున్న పేరు ఇదే !

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్‌లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత పేరు మార్చుకోనుంది. కత్రినా తాజాగా నటిస్తున్న స్పై థ్రిల్లర్ “టైగర్ 3” సినిమా ద్వారా ఈ విషయాన్నీ అధికారికంగా వెల్లడించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మేకర్స్‌కి సినిమా క్రెడిట్స్‌లో ‘కత్రినా కౌశల్’ అని వేయాల్సిందిగా తెలియజేసిందట.

Read Also : ‘ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా’ సాంగ్… బన్నీ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్

మరోవైపు కత్రినా, విక్కీ కౌశల్యొ వివాహ ఏర్పాట్లను ప్లాన్ చేయడానికి 10 మంది సభ్యుల బృందం సవాయ్ మాధోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారాకు బయలుదేరింది. కత్రినా, విక్కీ పెళ్ళి అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు వేడుకలు ఘనంగా జరుగుతున్నట్టు సమాచారం. విక్కీ, కత్రినా ఇటీవల జుహులో ఒక ఆధునిక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇంటి పక్కనే ఆ ఇల్లు ఉండడం విశేషం.

Related Articles

Latest Articles