‘నమస్తే లండన్’… గుడ్ బై ముంబై… కత్రీనా మనసులో మాట!

వన్స్ ఆప్ ఆన్ ఏ టైం ఇన్ ముంబై… కత్రీనా ‘ఇక చాలు’ అనుకుందట! ‘నమస్తే లండన్’ అంటూ తిరిగి తన స్వంత నగరానికి ఎగిరికి వెళ్లిపోదామని కూడా బ్రిటీష్ సుందరి డిసైడ్ అయిందట. ‘గుడ్ బై ముబై’ అనేసి శాశ్వతంగా ఇండియాని వదిలేద్దామనే నిర్ణయానికొచ్చిందట! ఇంతకీ, ఇదంతా ఎప్పుడు, ఎందుకు అంటారా? ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ ఇప్పుడు కాదు… ఒకప్పుడు…

జూలై 16న బర్త్ డే జరుపుకోవటంతో 38 ఏళ్లు పూర్తి చేసుకున్న సీనియర్ సుందరి కత్రీనా 2003లో ‘బూమ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ, ‘బూత్’ కాస్తా ఢామ్మనటంతో మొదట్లో డీలా పడింది. ఎంతలా అంటే, 2003 నుంచీ 2007 దాకా ఆమెకి ఫ్లాప్సు, విమర్శలు తప్ప సక్సెస్ ఎదురు కాలేదు. ప్లాస్టిక్ బొమ్మ అనేవారు ‘మల్లీశ్వరి’ని అప్పట్లో! కానీ, ‘నమస్తే లండన్’ మొత్తం అంతా మార్చేసింది! కత్రీనాకి తొలిసారి పొగడ్తలతో పాటూ కెరీర్ లో ఓ చెప్పుకోదగ్గ హిట్ వచ్చింది. కానీ, ‘నమస్తే లండన్’ రిలీజ్ కి ముందు క్యాట్ ముంబై వదిలి లండన్ వెళ్లిపోదామని అనుకుందట. బాలీవుడ్ వద్దు, అసలు నటనే వద్దు… మరేదైనా ‘వర్కవుట్’ అయ్యే కెరీర్ వెదుకుందామని కూడా స్ట్రాంగ్ గా నిర్ణయించుకుందట! ఫ్యాన్స్ అదృష్టం కొద్దీ చిక్నీ ఛమేలీ ఇండియా వదిలి చెక్కేయలేదు…

‘కాఫీ విత్ కరణ్’ షోలో కత్రీనా స్వయంగా చెప్పిన దాని ప్రకారం… ‘నమస్తే లండన్’ సినిమా చూసి తన అభిప్రాయం చెప్పమన్నాడట దర్శకుడు విపుల్ షా. కానీ, తీరా మూవీ చూసిన మేడమ్ గారికి నచ్చలేదట. కారణం ఏంటంటే… సినిమా నిండా తానే కనిపించిందట! కథ మొత్తం తన చుట్టూనే తిరగటంతో ఇక ‘నమస్తే లండన్’ పని అయిపోయినట్టే అనుకుంది. అప్పటికే ఆమెపై విమర్శలు, స్క్రీన్ మీద పెద్దగా బాగోదని దుష్ప్రచారం జరుగుతుండటంతో… “నేను బాగోనని’’ కత్రీనా కూడా అనుకునేదట!

‘నమస్తే లండన్’ సినిమా చూసి అభిప్రాయం చెప్పమన్న డైరెక్టర్ విపుల్ షాకి కత్రీనా ఫోన్ కూడా చేయలేదు. తన గదిలో బట్టలు ప్యాక్ చేసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేదాకా వెళ్లిపోయింది క్యాట్. కానీ, చూస్తుండగానే ‘నమస్తే లండన్’ విడుదల కావటం, హిట్ కావటం చకచకా జరిగిపోయాయి! ఆ తరువాత, ‘వెల్కమ్, అజబ్ ప్రేమ్ కీ గజబ్ కహానీ, జిందగీ నా మిలేగీ దుబారా, ఏక్ థా టైగర్, ధూమ్ 3, బ్యాంగ్ బ్యాంగ్’.. ఇవన్నీ జరిగిపోయాయి! నెక్ట్స్ ‘సూర్యవంశీ’ సినిమాలో మరోసారి తన ‘నమస్తే లండన్’ హీరో అక్షయ్ తోనే నటించింది కత్రీనా. ఆ సినిమా త్వరలోనే విడుదల కానుంది…

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-