ఇన్​స్టాలో కత్రినా కైఫ్ మరో మైలురాయి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ దాదాపు టాప్ హీరోలందరి సరసన నటించింది. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఆమె.. రీసెంట్ సోషల్ మీడియాలోనూ మరో మైలురాయిని చేరుకుంది. 50 మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న బాలీవుడ్ ఐదో హీరోయిన్​గా కత్రినా కైఫ్ నిలిచింది. ఈమె కంటే ముందు ప్రియాంక చోప్రా (63.3 మిలియన్లు), శ్రద్ధా కపూర్ (62 మిలియన్లు), దీపికా పదుకొణె (56.5 మిలియన్లు), ఆలియా భట్ (53.1 మిలియన్లు) ఉన్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధమవుతుండగా, ‘భూత్ పోలీస్’లోను నటిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-